వరుసగా రెండో రోజూ జీవితకాల గరిష్ఠాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు

25-11-2022 Fri 16:11
  • వరుసగా నాలుగో రోజు మార్కెట్లకు లాభాలు
  • 21 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 29 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను అమెరికా వచ్చే నెల కొంత సులభతరం చేస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62,294కు చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 18,512 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (1.34%), విప్రో (1.16%), టెక్ మహీంద్రా (1.01%), యాక్సిస్ బ్యాంక్ (0.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.86%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.30%), కోటక్ బ్యాంక్ (-0.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.87%), టైటాన్ (-0.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.54%).