50 మిలియన్ వ్యూయింగ్‌ మినిట్స్ సాధించిన ‘అహనా పెళ్లంట'

25-11-2022 Fri 14:33
  • జీ5లో సందడి చేస్తున్న 'అహనా పెళ్లంట'
  • రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా తరకెక్కిన చిత్రం 
  • కీలక పాత్రలను పోషించిన ఆమని, పోసాని
Ahana Pellanta achieved 50 million viewing minutes
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ 'అహనా పెళ్లంట' ప్రేక్షకులను మెప్పిస్తోంది. జీ5లో ఇటీవలే ప్రేక్షకల ముందుకు వచ్చిన ఈ చిత్రం 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను సాధించింది. అంతేకాదు, ఐఎండీబీ ప్రకటించిన టాప్ 10 ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ల లిస్ట్ లో కూడా చోటు దక్కించుకుంది.

 ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివానీల మధ్య కెమిస్ట్రీ హైలైట్ అని అందరూ అంటున్నారు. చక్కటి కామెడీతో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమ‌ని, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, గెట‌ప్ శీను, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, తాగుబోతు ర‌మేష్‌, మ‌ధునంద‌న్‌, భద్ర‌మ్‌, ర‌ఘు కారుమంచి, దొర‌బాబు త‌దిత‌రులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాహుల్ తమడ నిర్మాతగా వ్యవహరించారు.