'మీట్ క్యూట్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

24-11-2022 Thu 21:23
  • నాని సొంత బ్యానర్లో 'మీట్ క్యూట్'
  • ఐదు ఆసక్తికరమైన కథలతో నడిచే వెబ్ సిరీస్
  • సంగీత దర్శకుడిగా విజయ్  
  • దర్శకత్వం వహించిన నాని సోదరి దీప్తి
  • ఈ నెల 25వ తేదీ నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్
Meet Cute Webseries song released
నాని తన సొంత బ్యానర్లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వెళుతున్నాడు. ఆయన బ్యానర్లో రూపొందిన తాజా వెబ్ సిరీస్ రేపటి నుంచి 'సోని లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 
 
 ఈ వెబ్ సిరీస్ లో ఐదు ఆసక్తికరమైన కథలు ఉంటాయి. ఆ ఐదింటిలో అందమైన ప్రేమకథ ఒకటి ఉంది. ఈ క్యూట్ లవ్ స్టోరీలో శివ కందుకూరి - ఆదా శర్మ జంటగా కనిపించనున్నారు. ఈ జంటపై చిత్రీకరించిన పాటనే కొంతసేపటి క్రితం వదిలారు.

విజయ్ సంగీతాన్ని అందించిన ఈ పాట .. "నింగే ఏలే తారే మరి నేలే వాలే నేడే .. అన్నీ కొత్తేనేమో చిగురించే స్నేహంలోనే' అంటూ ఈ మెలోడీ సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ వెబ్ సిరీస్ కి నాని అక్కయ్య దీప్తి గంటా దర్శకత్వం వహించడం విశేషం.