ఆ పోస్టర్ లో ఉన్నది జనసేన గ్లాసు కాదు: అడివి శేష్

24-11-2022 Thu 19:08
  • అడివి శేష్ హీరోగా హిట్-2 చిత్రం
  • నిన్న ట్రైలర్ విడుదల
  • చేతిలో టీ గ్లాసుతో అడివి శేష్ పోస్టర్
  • జనసేన గ్లాసులా ఉందంటూ ప్రశ్నించిన మీడియా
Adivi Sesh clarifies his poster
యువ నటుడు అడివి శేష్ నటించిన హిట్-2 చిత్రం నుంచి నిన్న ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ లో అడివి శేష్ ఓ టీ గ్లాసు పట్టుకుని కనిపించారు. అయితే అది జనసేన గ్లాసును పోలి ఉండడం పట్ల మీడియా ప్రశ్నించింది. దీనిపై అడివి శేష్ స్పందిస్తూ, తమ చిత్రానికి, జనసేనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ పోస్టర్ లో కనిపిస్తున్నది జనసేన గ్లాసు కాదని అన్నారు. పవన్ కల్యాణ్, ఆయన తనయుడు అకీరాలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని వెల్లడించారు. 

శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్-2 చిత్రం గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్-2 చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాఖలో ఓ యువతి హత్య కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.