ఖుదీరాం బోస్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ

24-11-2022 Thu 18:26
  • గోవాలో 53వ ఇఫీ చలనచిత్రోత్సవం
  • తెలుగు బయోపిక్ ఖుదీరాం బోస్ ప్రదర్శన
  • రాకేష్ జాగర్లమూడిని అభినందించిన బాలయ్య, బోయపాటి
Balakrishna wishes Khudiram Bose unit members at IFFI
గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలుగు బయోపిక్ చిత్రం ఖుదీరాం బోస్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. 

ఈ సందర్భంగా ఇఫీ చలన చిత్ర ప్రదర్శనకు హాజరైన టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.... ఖుదీరాం బోస్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడిని అభినందించారు. 

కాగా, బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' చిత్రం కూడా ఇఫీ చలనచిత్రోత్సవానికి ఎంపికైన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో అఖండతో పాటు 'ఆర్ఆర్ఆర్' కూడా ఎంపికైంది.