Sensex: భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొత్త రికార్డు నెలకొల్పిన సెన్సెక్స్

  • 762 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 217 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతం వరకు పెరిగిన ఇన్ఫోసిస్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతామన్న ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో, ఈరోజు సెన్సెక్స్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడి 62,273కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 18,484కి ఎగబాకింది. ఐటీ, టెక్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిన్ (2.93%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.56%), విప్రో (2.43%), టెక్ మహీంద్రా (2.39%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.14%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.10%), కోటక్ బ్యాంక్ (-0.09%).

More Telugu News