యథార్థ సంఘటన నుంచి ఈ కథ పుట్టింది: అల్లరి నరేశ్

24-11-2022 Thu 13:41
  • రేపు రిలీజ్ అవుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ 
  • 90 శాతం చిత్రీకరణ ఫారెస్టులోనే జరిపామన్న నరేశ్ 
  • ఆడియన్స్ కోరుకునే కొత్తదనం ఉందని వెల్లడి  
Itlu Maredumilli Prajaneekam movie team press meet
అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఆనంది కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ స్టేజ్ పై అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. "ట్రైబల్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గురించిన ఒక ఆర్టికల్ చదివిన మా డైరెక్టర్ గారు, ఆ అంశాన్ని కథగా రెడీ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. ఈ కాలంలోను కనీస వసతి సౌకర్యాలు లేక ఆ ఏరియాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు" అన్నారు.

ఈ సినిమాలో తెరపై కనిపించే 90 శాతాన్ని మారేడుమిల్లిలోనే చిత్రీకరించడం జరిగింది. మా డైరెక్టర్ గారి టేకింగ్ ..  సినిమాటోగ్రఫీ .. ఆర్ట్ డైరెక్టర్ పనితనం .. శ్రీచరణ్ పాకాల సంగీతం .. పృథ్వీ కంపోజ్ చేసిన ఫైట్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఈ రోజుల్లో కొత్తదనం ఉంటేనే సినిమా చూస్తున్నారు. అలాంటి కొత్తదనం ఉన్న సినిమా ఇది" అంటూ చెప్పుకొచ్చారు.