'వీరసింహా రెడ్డి' ఫస్టు సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

23-11-2022 Wed 19:40
  • బాలయ్య 107వ సినిమాగా 'వీరసింహా రెడ్డి'
  • రాయలసీమ నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 25వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్
  • ప్రతి నాయకుడిగా దునియా విజయ్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
Veera Simha Reddy Movie Update
రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. ఆ కథలతో వచ్చిన ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన అదే తరహా కథతో 'వీరసింహా రెడ్డి' సినిమాను చేస్తున్నారు. కెరియర్ పరంగా బాలయ్యకి ఇది 107వ సినిమా. 

ప్రస్తుతం చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపుదశలో ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బాలయ్య సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన అందించిన బాణీల్లో ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఈ నెల 25వ తేదీన ఉదయం 10:29 నిమిషాలకు ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. 'రాజసం నీ ఇంటి పేరు' అంటూ ఫస్టు సింగిల్ కొనసాగనుంది. చూస్తుంటే ఇది బాలయ్య ఇంట్రడక్షన్ సాంగ్ అనిపిస్తోంది.  ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్న ఈ సినిమాలో, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.