లుంగీ పైకి కట్టేసి మాస్ స్టెప్పులు వేసిన 'వాల్తేరు వీరయ్య'

23-11-2022 Wed 16:25
  • చిరంజీవి తాజా చిత్రంగా 'వాల్తేరు వీరయ్య'
  • బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా  
  • ఐటమ్ నెంబర్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా
  • ఆమెకి ఇదే ఫస్టు తెలుగు సినిమా 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
Waltair Veerayya movie song released
చిరంజీవి కథానాయకుడిగా 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత ఆయన ఈ తరహా మాస్ లుక్ తో కనిపిస్తున్న సినిమా ఇదే. 

ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ 'బాస్ పార్టీ' అనే ఒక మాస్ నంబర్ ను అందించాడు. ఆ పాటను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. చిరంజీవి -  బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన పాట ఇది. 'క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ సాహిత్యాన్ని అందించి ఆయన స్వరం కలపడం జరిగింది. నకష్ అజాజ్ - హరిప్రియ ఈ పాటను ఆలపించారు. 

చిరంజీవి మోడ్రన్ ముఠామేస్త్రి తరహాలో లుంగీ పైకి కట్టి స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ బాగుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.