ఆ రూమర్ తరువాత మరింత స్ట్రాంగ్ అయ్యాను: శివాని రాజశేఖర్

23-11-2022 Wed 14:37
  • ఇటీవలే వచ్చిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ 
  • ప్రస్తుతం కెరియర్ పైనే దృష్టి పెట్టానన్న శివాని 
  • పెళ్లికి వచ్చిన కంగారేం లేదని వెల్లడి 
  • మా ఫ్యామిలీపై ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయని వ్యాఖ్య    
Shivani Rajasekhar Interview
శివాని రాజశేఖర్ ఒక వైపున సినిమాలు చేస్తూ . మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ వెళుతోంది. ఇటీవల ఆమె చేసిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్, జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ నా కెరియర్ పై మాత్రమే నేను దృష్టి పెట్టాను" అంది. 

"మా ఇంట్లో మా అమ్మానాన్నలు కూడా నా పెళ్లి గురించిన ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు. ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నాము. అందువలన పెళ్లి గురించి ఆలోచించేంత సమయం లేదు. అయినా ఇప్పట్లో నా పెళ్లికి వచ్చిన కంగారేం లేదు. కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్లాలి అనే ఆలోచనతోనే ఉన్నాను" అని చెప్పింది. 

"నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టుగా కూడా ఒక రూమర్ వచ్చింది. మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో కొందరు చనిపోయినట్టుగా వీడియోస్ కూడా పెడుతున్నారు. వాటితో పోల్చుకుంటే నా విషయంలో వచ్చిన రూమర్ చాలా చిన్నదే. అయినా ఆ తర్వాత నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను లెండి" అంటూ చెప్పుకొచ్చింది శివాని.