మల్లారెడ్డి బంధువు నివాసంలోనూ ఐటీ దాడులు... భారీగా నగదు స్వాధీనం

22-11-2022 Tue 14:59
  • ఈ ఉదయం నుంచి మల్లారెడ్డిపై ఐటీ అటాక్
  • సుచిత్రలో నివాసం ఉంటున్న బంధువు త్రిశూల్ రెడ్డి
  • త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల నగదు సీజ్
IT Raids on Mallareddy relatives
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఈ ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. 

మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.