kodali nani: చంద్రబాబు, లోకేశ్ దాకా ఎందుకు, నాపై గెలువు చూద్దాం: కొడాలి నానికి రావి సవాల్

tdp ex mla ravi venkateswar rao fires on gudivada mla kodali nani
  • నానికి కిడ్నీతో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగినట్లుందని ఎద్దేవా
  • సొమ్మును విచ్చలవిడిగా విరజిమ్మినా నెగ్గలేడని వ్యాఖ్య 
  • ప్రజాగ్రహానికి వైసీపీ నేతలు కొట్టుకుపోతారని రావి విమర్శలు
వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. కొడాలిపై పోటీకి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రావాల్సిన అవసరంలేదని తేల్చేశారు. చంద్రబాబు, లోకేశ్ వంటి పెద్ద లీడర్ల దాకా ఎందుకు దమ్ముంటే తనపై గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. మంగళవారం రావి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. గుడివాడలో టీడీపీ తరఫున చంద్రబాబు, లోకేశ్ వచ్చి పోటీ చేసినా ఓడిస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేయడం తెలిసిందే. దీనిపై రావి స్పందించారు.

కొడాలి నానికి ఇటీవల కిడ్నీ ఆపరేషన్ తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా అయినట్లుందని రావి ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్ అన్న పిలుపుతో తొందరపడి ఇటువంటి నేతలను ఎన్నుకోవడం తమ ఖర్మ అని ప్రజలు ఛీదరించుకుంటున్నారని చెప్పారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు ఇదే చివరి చాన్స్ అని అన్నారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా విరజిమ్మినా 2024లో కొడాలి నాని గెలవలేడని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొడాలి లెక్కలు, వాటికి పక్కా ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
kodali nani
gudivada
ravi venkateswar rao
tdp
2024 elections
YSRCP

More Telugu News