Sanitary Pads: శానిటరీ ప్యాడ్స్ లో హానికారక రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ల గుర్తింపు
  • అన్ని ప్రముఖ శానిటరీ నాప్కిన్లది ఇదే పరిస్థితి
  • ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ సంస్థ అధ్యయనం వెల్లడి
Popular Sanitary Pads Sold in India Have Harmful Chemicals Cause Serious Health Issues Report

ఈ వివరాలు వింటే.. శానిటరీ ప్యాడ్స్ ను ఉపయోగించే మహిళలు ఉలిక్కి పడతారు. మనదేశంలో పేరొందిన శానిటరీ నాప్కిన్ లు అన్నింటిలో హానికారక రసాయనాలు ఉన్నట్టు ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. మన దేశంలో ఈ రసాయనాల వినియోగాన్ని పరిమితం చేసే ఎటువంటి నిబంధనలు లేకపోవడమే వాటి విచ్చలవిడి వినియోగానికి కారణమని తెలిపింది. 


ఈ హానికారక రసాయనాలు దీర్ఘకాలంలో మహిళలకు కలిగించే అనర్థాల గురించి ప్రముఖ కంపెనీలకు పట్టింపు లేకపోవడాన్ని టాక్సిక్ లింక్ ప్రస్తావించింది. ‘గోప్యతతో చుట్టబడింది’’ అనే పేరుతో ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే రెండు రకాల కెమికల్స్ గురించి తెలుసుకునేందుకు టాక్సిక్ లింక్ లోతైన అధ్యయనమే నిర్వహించింది.

పలు ఉత్పత్తుల్లో ప్లాస్టిసైజర్స్ గా థాలేట్స్ ను ఉపయోగిస్తుంటారు. ప్లాస్టిసైజర్స్ వల్ల ఉత్పత్తులు సాఫ్ట్ గా, సాగే గుణంతో ఉంటాయి. నూరేళ్ల నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో థాలేట్స్ ను ఉపయోగిస్తున్నారు. శానిటరీ నాప్కిన్లలో ఎలాస్టిసిటీ (సాగేగుణం) కోసం థాలేట్స్ ను ఉపయోగిస్తుంటారు. పది రకాల శానిటరీ ప్యాడ్స్ పై పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. ఆర్గానిక్, ఇనార్గానిక్ పేరుతో ఉన్నవీ పరిశీలించారు. ప్రతీ ఉత్పత్తిలోనూ థాలేట్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయని గుర్తించారు. 

ఇవీ అనర్థాలు..
దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే టాప్ 2 శానిటరీ ప్యాడ్స్ లో ఆరు రకాల థాలేట్స్ ఉంటున్నాయి. మొత్తం మీద 12 రకాల థాలేట్స్ ను పరిశోధకులు గుర్తించారు. ఈ థాలేట్స్  వల్ల ఎండోమెట్రియోసిస్, గర్భధారణ సంబంధిత సమస్యలు, గర్భంలో శిశువు ఎదుగుదలపై ప్రభావం, ఇన్సులిన్ నిరోధకత, హైపర్ టెన్షన్ తదితర సమస్యలు కారణమవుతాయని చెబుతున్నారు.

More Telugu News