ఫస్టులుక్ పోస్టర్ వదులుతున్న వెంకట్ ప్రభు!

22-11-2022 Tue 12:46
  • షూటింగు దశలో చైతూ 22వ సినిమా
  • రెండోసారి ఆయన జోడీకట్టిన కృతి శెట్టి   
  • తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 
  • సంగీత దర్శకులుగా ఇళయరాజా - యువన్ శంకర్ రాజా
  • ఈ నెల 23వ తేదీన టైటిల్ పోస్టర్ రిలీజ్  
Chaitu movie update
నాగచైతన్య తాజా చిత్రం షూటింగు దశలో ఉంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. చైతూ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగు కోసం సెట్స్ పైకి వెళ్లింది. 

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఇప్పుడు ఒక టైటిల్ ను సెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 23వ తేదీన రివీల్ చేస్తూ, ఆ రోజున ఉదయం 10:18 నిమిషాలకు ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నట్టుగా, ప్రీ లుక్ ద్వారా తెలియజేశారు.

'బంగార్రాజు' తరువాత చైతూ - కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇళయరాజా - యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని సమకూర్చుతుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.