British: ఫ్రాన్స్ లో పట్టుబడ్డ భారీ గోల్డ్ ఫిష్

British angler catches massive 30 kg goldfish netizens are stunned
  • దీని బరువు 30 కిలోలు
  • జాలరి వలకు చిక్కిన బంగారు వర్ణం చేప
  • దీన్ని చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ ఫిష్ ఇదే
మనం ఆక్వేరియంలలో పెంచుకునే గోల్డ్ ఫిష్ తెలిసే ఉంటుంది. చిన్నగా, రూపాయి కాయిన్ పరిమాణంలో నీటి తొట్టిలో అటూ, ఇటూ కదులుతూ ఎంతో ఆకర్షిస్తుంటుంది. కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉంటుందని చెబితే నమ్మగలరా..? కానీ, నమ్మాల్సిందే. ఫ్రాన్స్ లో ఓ జాలరి వలకు ఈ భారీ సైజు గోల్డ్ ఫిష్ చిక్కింది.

సాధారణంగా గోల్డ్ ఫిష్ అంటే చిన్నసైజు చేప అనే విషయం ఎక్కువ మందికి తెలుసు. కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్ జాలరి వలకు చిక్కడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ‘‘క్యారట్ (గోల్డ్ ఫిష్ నిక్ నేమ్) వలకు చిక్కిందని తెలుసు. కానీ, దాన్ని నేను పట్టుకోగలుగుతానని అనుకోలేదు’’ అని పేర్కొన్నాడు సదరు జాలరి. బ్లూవాటర్ లేక్స్ ఫేస్ బుక్ పేజీ ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది.
British
angler
catches
Massive gold fish

More Telugu News