New Zealand: సుప్రీంకోర్టు తీర్పుతో ఓటు హక్కు వయసును తగ్గిస్తున్న న్యూజిలాండ్

  • 18 నుంచి 16 ఏళ్లకు వయసును తగ్గించాలని నిర్ణయం
  • 18 ఏళ్లు దాటిన వారికే ఓటు హక్కు సరికాదన్న ఆ దేశ సుప్రీంకోర్టు
  • ఓటు హక్కు వయసును తగ్గించడానికి ఆసక్తిగా ఉన్న ప్రధాని జెసిండా
New Zealand to bring down voter age to 16

న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు వయసును తగ్గిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించబోతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఓటు హక్కును పొందాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. ఈ కనీస వయసును 16 ఏళ్లకు తగ్గించబోతున్నారు. ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికే ఓటు హక్కును కల్పించడమనేది మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 

మరోవైపు ప్రధాని జెసిండ్ కూడా ఓటు హక్కు వయసును తగ్గించడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టరూపం దాల్చాలంటే పార్లమెంటులో 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే, ప్రపంచంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్న దేశాల్లో బ్రెజిల్, క్యూబా, ఆస్ట్రియా దేశాలు మాత్రమే ఉన్నాయి.

More Telugu News