Chandrababu: వ్యవస్థలు సమాధి అయితే వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి: ప్రకాశం జిల్లాలో శ్మశానం కబ్జాపై చంద్రబాబు

Chandrababu slams YCP leaders on alleged cemetery encroachment in Prakasam dist
  • ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో శ్మశానం కబ్జా
  • వైసీపీ నేతలపై ఆరోపణలు .. ఓ పత్రికలో కథనం
  • అధికారులు ఏంచేస్తున్నారంటూ బాబు విమర్శలు 
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో వైసీపీ నేతలు శ్మశానాన్ని కబ్జా చేశారంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. 100కి పైగా శవాలను పూడ్చిన ఆ శ్మశానాన్ని వైసీపీ నేతలు దుక్కి దున్ని మినుము పంట సాగు చేస్తున్నారంటూ ఈ కథనంలో పేర్కొన్నారు. 

ఈ కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసీపీ పిశాచాలు పడ్డాయని పేర్కొన్నారు. వైసీపీ స్థానిక నేతలు సమాధులను తవ్వేసి శ్మశానాన్ని కబ్జా చేస్తే... అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. 

వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయని చంద్రబాబు వివరించారు. ఈ వ్యవహారంలో కనీసం ఉన్నతాధికారులు అయినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జాదారులపై చర్యలకు దిగాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Encroachment
Cemetery
Old Singarayakonda
Prakasam District
YSRCP

More Telugu News