చంద్రబాబు, లోకేశ్ వచ్చి పోటీ చేసినా గెలిచేది నేనే: కొడాలి నాని

21-11-2022 Mon 17:17
  • గుడివాడలో మళ్లీ గెలిచేది నేనేనన్న నాని  
  • చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేదేమీ లేదని వ్యాఖ్య 
  • టీడీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ ఎద్దేవా 
Coming are last elections to CHandrababu says Kodali Nani
గుడివాడలో మళ్లీ గెలిచేది తానేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ వచ్చి పోటీ చేసినా వైసీపీ అభ్యర్థిగా తానే ఉంటానని చెప్పారు. వేల కోట్లు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చినా తన గెలుపును ఆపలేవని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్ర ప్రజలకు పోయేదేమీ లేదని అన్నారు. చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్ ను తరిమేందుకు ఎన్టీఆర్ వారసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల తర్వాత ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటారని చెప్పారు.