Sensex: చైనా కరోనా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మన స్టాక్ మార్కెట్లు

  • చైనాలో మళ్లీ నమోదవుతున్న కారోనా కేసులు
  • 518 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 147 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. వరుసగా మూడో సెషన్ ను నష్టాలతో ముగించాయి. చైనాలో మరోసారి మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటం, చాలా రోజుల తర్వాత కరోనా మరణం సంభవించడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. 

ఈ క్రమంలో ఈ ఉదయం ప్రతికూల సంకేతాల మధ్యే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 518 పాయింట్లు నష్టపోయి 61,144కి పడిపోయింది. నిఫ్టీ 147 పాయింట్లు పతనమై 18,159 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.70%), యాక్సిస్ బ్యాంక్ (-1.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.76%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.39%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.83%), హెచ్డీఎఫ్సీ (-1.80%), టీసీఎస్ (-1.78%), టెక్ మహీంద్రా (-1.78%), ఇన్ఫోసిస్ (-1.61%).

More Telugu News