low gi: ఈ ఆహారంతో పొట్టలో కొవ్వు కరిగి.. గుండెకు ఆరోగ్యం

  • జీఐ తక్కువగా ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
  • దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారించొచ్చు
  • బ్రౌన్ రైస్, తాజా పండ్లు, నట్స్, సీడ్స్, ఓట్స్ మంచివి
Consume these foods for abdominal fat loss improved cardiovascular health

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోవచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది తిన్న వెంటనే ఎంత మేర బ్లడ్ గ్లూకోజ్ పెరిగేందుకు కారణమవుతుందన్ని తెలియజేస్తుంది. జీఐ 55 అంతకంటే తక్కువ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జీఐ 56-69 మధ్య ఉంటే మధ్యస్థంగాను, 70 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక జీఐ గాను పరిగణిస్తారు. కనుక జీఐ 55 కంటే తక్కువగా ఉన్న ఆహారం మంచిది.

జీఐ తక్కువ ఉండే వాటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరగకుండా చూసుకోవచ్చు. కనుక డయాబెటిస్ ఉన్న వారికి మంచి పరిష్కారం. రక్తంలో గ్లూకోజ్ పెరగకపోవడం వల్ల కొలెస్ట్రాల్, బరువు అదుపులో ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. కేన్సర్ రిస్క్ ను కూడా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక జీఐ తక్కువగా ఉంటే వాటిని తీసుకుంటే పొట్టలో కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది. 

  • బంగాళాదుంపలను తీసుకోవద్దు. దీనికి బదులు చిలగడదుంపలు తినొచ్చు. పొటాటో కంటే స్వీట్ పొటాటోలో జీఐ తక్కువగా ఉంటుంది.
  • క్వినోవా, అమర్ నాథ్ వంటి సిరీయుల్స్ మంచివి. 
  • వైట్ బ్రెడ్ కు బదులు హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవాలి. దీనివల్ల అధిక పోషకాలు అందుతాయి. జీఐ కూడా తక్కువ ఉంటుంది.
  • ఇన్ స్టంట్ ఓట్స్ కు బదులు స్టీల్ కట్ ఓట్స్ తీసుకోవాలి. ప్యాకేజ్డ్ కార్న్ ఫ్లేక్స్ కు బదులు, స్టీల్ కట్ ఓట్స్ తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా ప్రాసెస్ చేసినవి. వాటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రోల్డ్ ఓట్స్ తింటే జీఐ చాలా తక్కువ.
  • వైట్ రైస్ తినే వారు దానికి బదులు బ్రౌన్ రైస్ తినాలి. దీనివల్ల మరింత ఫైబర్ అందుతుంది.
  • బిస్కెట్లు, కుకీలకు బదులు తాజా పండ్లు, నట్స్, సీడ్స్ ను తినాలి. గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు మంచివి. 
  • అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారంతో కొలెస్ట్రాల్, ఇన్ ఫ్లమేషన్ పెరిగి గుండెకు ముప్పు ఏర్పడుతుంది. కనుక జీఐ తక్కువగా ఉండేవి మంచి పరిష్కారం

More Telugu News