NTR District: ఎన్టీఆర్ జిల్లాలో కనిపించకుండా పోయిన ఎన్నారై మహిళ

NRI woman missing in NTR District
  • అమెరికాలో న్యాయవాదిగా పని చేస్తున్న మహిళ
  • ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వచ్చిన వైనం
  • నందిగామ నుంచి విజయవాడకు వెళ్లిన మహిళ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన ఓ ఎన్నారై మహిళ కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నందిగామ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు ఎన్నారై మహిళ... అమెరికాలో న్యాయవాదిగా పని చేస్తున్నారు. అక్టోబర్ 29న ఆమె అమెరికా నుంచి వచ్చారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆటోలో నందిగామ బస్టాండ్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడకు వెళ్లారు. 

అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయారు. ఆమె తిరిగి రాకపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడందో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫోన్ ను కూడా ఇంటి వద్దే వదిలి వెళ్లారు. తన పాస్ పోర్టును మాత్రం తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NTR District
Nandigama
NRI Woman

More Telugu News