కేసీఆర్ కాళ్లు మొక్కడం అదృష్టం.. వందసార్లు మొక్కుతా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

21-11-2022 Mon 11:04
  • ఇటీవల ఓ కార్యక్రమంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన శ్రీనివాస్
  • తన దృష్టిలో కేసీఆర్ అంటే తెలంగాణ బాపు అని వ్యాఖ్య
  • కేసీఆర్ తనకు పితృ సమానులన్న హెల్త్ డైరెక్టర్
Will touch KCRs feet 100 times says Telangana Health Director Srinivas Rao
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మొక్కిన ఘటన చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రగతి భవన్ లో కొత్త మెడికల్ కాలేజీలను కేసీఆర్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా రెండుసార్లు ఆయనకు శ్రీనివాస్ కాళ్లు మొక్కారు. 

తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ... తన దృష్టిలో కేసీఆర్ అంటే తెలంగాణ బాపు అని చెప్పారు. ఆయన పాదాలకు నమస్కరిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఒక్కసారి కాదు... వందసార్లు అయినా కేసీఆర్ కాళ్లు మొక్కుతానని చెప్పారు. కేసీఆర్ తనకు పితృ సమానులు అని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి చేస్తున్న యజ్ఞంలో తాను కూడా భాగస్వామిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కొత్తగూడెంలో నిర్వహించిన మున్నూరుకాపు వనభోజనాల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.