Afghanistan: మహిళలను కొరడాలతో కొట్టి.. షరియా చట్టాన్ని అమలు చేసిన తాలిబన్లు

  • మహిళలు సహా 19 మందిని కొరడాలతో కొట్టి శిక్షించిన తాలిబన్లు
  • షరియా చట్టాలు అమలు చేస్తున్నామన్న తాలిబన్లు
  • ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి
Taliban Publicly Flogged 19 People As Punishment

తాలిబన్ రాజ్యం ఆఫ్ఘనిస్థాన్‌లో పౌరుల స్వేచ్ఛ అంతకంతకూ హరించుకుపోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మహిళలను చదువు, ఉద్యోగాలకు దూరం చేసిన తాలిబన్లు.. వారు బయట తిరిగేందుకు కూడా ఆంక్షలు విధించారు. తాజాగా ఇప్పుడు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పలు నేరాలకు సంబంధించి మహిళలు సహా 19 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టి శిక్షించారు. తఖార్ ప్రావిన్సులోని తలూఖన్ నగరంలో జరిగిందీ ఘటన. 

శిక్ష అనుభవించిన వారిలో 10 మంది పురుషులు కాగా మిగతా వారు మహిళలు. ఈ నెల 11న పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలో షరియా చట్టాలకు లోబడి శిక్ష అమలు చేసినట్టు తాలిబన్ అధికారి అబ్దుల్ రహీం రషీద్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్న తర్వాత తాలిబన్లు ఇలాంటి శిక్ష విధించడం ఇదే తొలిసారి. 1990లలోనూ తాలిబన్లు ఇలాంటి శిక్షలే విధించేవారు. న్యాయస్థానంలో శిక్ష పడిన వారిని బహిరంగంగా ఉరితీసేవారు. రాళ్లతో కొట్టి చంపేసేవారు. కొరడాలతో కొట్టేవారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి శిక్షలు విధిస్తుండడంతో ఆఫ్ఘన్ ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు.

More Telugu News