దాదాపు ఆర్నెల్ల తర్వాత చైనాలో కొవిడ్ మరణం
- కరోనాకు పుట్టిల్లుగా నిలిచిన చైనా
- ప్రపంచవ్యాప్తంగా వణికించిన వైరస్ మహమ్మారి
- కఠినమైన ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన చైనా
- ఇటీవల చైనాలో మళ్లీ పాజిటివ్ కేసులు
బీజింగ్ కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడిన మరణించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నేడు ప్రకటించింది. మే 26 తర్వాత చైనాలో కరోనా మరణం నమోదవడం ఇదే ప్రథమం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా మృతులసంఖ్య 5,227కి పెరిగింది.
కాగా, చైనాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరం చేసినప్పటికీ, కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కనీసం ఒక్క డోసు తీసుకున్నవారు 92 శాతం మంది ఉన్నారు.