జాబిల్లిపై ఉదయిస్తున్న పుడమి... వీడియో ఇదిగో!

20-11-2022 Sun 16:07
  • భూమికి ఉపగ్రహం చంద్రుడు
  • భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణం
  • భూమి ఉదయిస్తున్న దృశ్యాలను చిత్రీకరినించి జపాన్ స్పేస్ క్రాఫ్ట్
  • వీడియో వైరల్
Earth rising on Moon
భూమిపై సూర్యోదయం, సూర్యాస్తమయాలు తెలిసిందే. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే.... భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై భూమి ఉదయిస్తుంది. 

దీనికి సంబంధించిన అద్భుత దృశ్యాలను జపాన్ కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా చిత్రీకరించింది. చంద్రుడి ఉపరితలం మీదుగా పుడమి ఉదయిస్తుండడాన్ని కగుయాలోని అత్యాధునిక కెమెరాలు బంధించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.