పవన్ కల్యాణ్ అనుకుంటే చేస్తాడు: చిరంజీవి

20-11-2022 Sun 15:18
  • వైఎన్ఎం కాలేజి పూర్వ విద్యార్థుల సమావేశం
  • హైదరాబాద్ లో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా చిరంజీవి
  • ఆసక్తికర వ్యాఖ్యలతో ప్రసంగం
  • పవన్ రాజకీయాలకు తగినవాడని వెల్లడి
Chiranjeevi says Pawan Kalyan has firm mentality
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను ఇప్పటివరకు అనుకువన్నీ చేశానని చెప్పారు. తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది ఎన్ సీసీ అని తెలిపారు. కాలేజీలో వేసిన నాటకంతో సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. అప్పటినుంచి, అనుకున్నదాని అంతు చూడడం నేర్చుకున్నానని వివరించారు. 

పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని చిరంజీవి వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు. ఏదో ఒకనాడు పవన్ కల్యాణ్ ను ఉన్నతస్థాయిలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో మాటలు పడాల్సి ఉంటుందని, ఒక్కోసారి మనం కూడా మాటలు అనాల్సి ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. మొరటుగా, కటువుగా లేకపోతే రాజకీయాల్లో రాణించలేరని, ఓ దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించిందని అన్నారు.