అనూష శెట్టితో ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి వేడుక

20-11-2022 Sun 13:46
  • అనూష శెట్టిని పెళ్లాడిన యువ హీరో
  • బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్లో వేడుక
  • కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులకే ఆహ్వానం
Tollywood young hero naga showrya ties knot with anusha
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు.  ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు.  బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు. అంతకుముందు శనివారం రాత్రి యువ దంపతులు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగశౌర్య .. అనూష వేలికి ఉంగరం తొడిగాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన  ఫొటోలు సైతం ఇప్పుడు నెట్ లో వైరల్ అయ్యాయి.