వికారాబాద్ జిల్లాలో బస్సు బోల్తా

20-11-2022 Sun 13:00
  • మహిళ మృతి.. పదిమందికి గాయాలు
  • బ్రేక్ ఫెయిల్ అవడంవల్లే ప్రమాదం
  • అనంతగిరి గుట్ట వద్ద అదుపుతప్పిన బస్సు
  • గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చిన అధికారులు
TSRTC bus met with accident in vikarabad
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టీఎస్ ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వికారాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు తాండూరు నుంచి వికారాబాద్ కు వస్తుండగా అనంతగిరి గుట్ట సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. 

బ్రేకులు ఫెయిలవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో పదిమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.