ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరిక
రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి.. తీవ్ర అల్పపీడనం మారింది. 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండగా మారనుందని పేర్కొంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు.