తొలిసారి చేతులు కలిపిన సాకర్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డో

20-11-2022 Sun 11:37
  • ఫిఫా ప్రపంచ కప్ ప్రచారంలో భాగమైన స్టార్లు
  • నేటి నుంచి ఫిఫా ప్రపంచ కప్
  • తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ 
Ronaldo and Messi come together for first ever joint promotion ahead of FIFA WC
ఎడారి దేశం ఖతార్లో ఆదివారం నుంచి ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ మొదలనుంది. ఫుట్ బాల్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఈ టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. డిసెంబర్ 18వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో నాలుగేసి జట్ల చొప్పున ఎనిమిది గ్రూపుల్లో బరిలో నిలిచాయి. యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఈ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు ఖతార్ దాదాపు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్యతో కలిసి అదే స్థాయిలో టోర్నీకి ప్రచారం కల్పిస్తోంది. 

ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ప్రచారంలో ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తొలిసారి పాలు పంచుకున్నారు. ప్రమోషన్ క్యాంపెయిన్ కోసం ఇద్దరూ చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి ఉన్న వారి కొత్త ప్రచార చిత్రాలను ఫిఫా విడుదల చేసింది. ఇందులో రొనాల్డో మెస్సీ చెస్ ఆడుతున్నట్లు కనిపించింది. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  కాగా, ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచ కప్‌ తనకు అర్జెంటీనా స్టార్ మెస్సీ ఇప్పటికే ధృవీకరించాడు. అయితే రొనాల్డో తాను మరికొన్ని సంవత్సరాలు ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.