pan card: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే..!

PAN CARD OF SUCH PEOPLE WILL BE OF NO USE WARNING ISSUDE BY INCOME TAX DEPARTMENT
  • ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా
  • మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ
  • తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన
బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.. రూ.50 వేలకు పైబడిన వ్యవహారాలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే! ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే... ఆధార్ తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. పాన్ కార్డును, ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేసుకోవడానికి చివరి అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. 

ఈలోపు లింక్ చేసుకోవడం తప్పనిసరని, ఆ తర్వాత లింక్ చేయడం కుదరదని హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. 31 మార్చి 2023 తర్వాత పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం సాధ్యం కాదని, పాన్ కార్డు రద్దయిపోతుందని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింక్ కోసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని చెబుతోంది. 

లింక్ చేసుకోవడం ఇలా..
ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి. 

అక్కడ మీ పాన్‌నంబర్, ఆధార్ నంబర్, ఇతర వివరాలు ఇవ్వాలి.

ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

పాన్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. వాలిడేట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

రూ.వెయ్యి జరిమానా చెల్లించాక మీ పాన్-ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.
pan card
adhar
link
Income Tax
fine

More Telugu News