కొండచిలువను మెడలో వేసుకున్న విజయసాయిరెడ్డి... ఫొటోలు ఇవిగో!

19-11-2022 Sat 18:41
  • శంషాబాద్ ఫాంహౌస్ లో సేదదీరిన విజయసాయి
  • ఫాంహౌస్ లో అనేక జీవజాతులు
  • వాటిని ఆసక్తిగా పరిశీలించిన విజయసాయి
  • ఎంతో వినోదదాయకం అంటూ ట్వీట్
Vijayasai Reddy played with Pythons at Shamshabad farm
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శంషాబాద్ లోని ఫాంహౌస్ లో ఉల్లాసంగా గడిపారు. ఈ ఫామ్ లో ఉన్న ఓ అరుదైన తెల్ల కొండచిలువను మెడలో వేసుకుని ప్రదర్శించారు. మరికొన్ని చిన్న కొండచిలువలను చేత్తో పట్టుకున్నారు. వాటిని ఆసక్తిగా పరిశీలించారు. అంతేకాదు, ఓ భారీ సాలీడును కూడా తన చేతిపైకి ఎక్కించుకున్నారు. ఈ ఫాంహౌస్ లో రంగురంగుల మకావు చిలుకలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. వివిధ జీవజాతులు వైవిధ్యభరితమైన సౌందర్యాన్ని ఆసక్తిగా గమనించడం తనకు వినోదాన్నిస్తుందని తెలిపారు.