కర్నూలులో చంద్రబాబు ఆవేశం చూసి బాధేసింది: యనమల

19-11-2022 Sat 17:31
  • కర్నూలులో చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం
  • నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
  • హాజరైన సీనియర్ నేతలు
  • ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్న యనమల
Yanamala opines on Chandrababu speech in Kurnool
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న కర్నూలులో చంద్రబాబు చేసిన ఆవేశపూరితమైన ప్రసంగం పట్ల స్పందించారు. 

కర్నూలులో మీ ఆవేశం చూసి మేం బాధపడ్డాం అని యనమల వెల్లడించారు. మీరు టెన్షన్ చెందవద్దు... ప్రశాంతంగా ఉండండి... మాకు తగిన సలహాలు ఇవ్వండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని, అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇంతకుముందు మాదిరే ప్రతి మూడు జిల్లాలకు ఓ ఇన్చార్జిని నియమించాలని యనమల సూచించారు.