Nani: నాని అక్క దర్శకత్వం వహించిన ‘మీట్ క్యూట్’ సిరీస్​ ట్రైలర్​ రిలీజ్​

Nani shares trailer of Meet Cute to stream on SonyLIV on November 25
  • సమర్పకుడిగా నాని
  • ఈ నెల 25 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్
  • ఐదు ఎడిసోడ్స్ లో స్ట్రీమింగ్ 
హీరో నాని అక్క గంటా దీప్తి దర్శకురాలిగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఐదు కథల సమాహారంతో కూడిన ఈ సిరీస్ ను నాని సమర్పిస్తున్నాడు. తన సొంత ప్రొడక్షన్ హౌజ్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్న ఈ సిరీస్ సోని లివ్ లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. మొత్తం ఐదు ఎడిసోడ్స్ లో స్ట్రీమ్ అవనుంది. ఇందులో హీరోయిన్స్ అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, హీరోలు అశ్విన్ కుమార్, శివ కందుకూరి, సీనియర్ నటులు సత్యరాజ్, రోహిణి  ముఖ్యపాత్రలు పోషించారు. 

ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ ట్రైలర్‌‌ విడుదలైంది. నాని వాయిస్ ఓవర్ తో.. ‘నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ బుల్గానిన్ బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉందని, ఈ తరం యువతకు తగ్గట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ కు వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
Nani
sister
meet cute
series
stream
SonyLIV
November 25

More Telugu News