Virat Kohli: ఉత్తరాఖండ్ లో సందడి చేసిన కోహ్లీ దంపతులు

VIRAT KOHLI ANUSHKA SHARMA IN UTTARAKHAND WITH THEIR LITTLE ONE VAMIKA
  • కూతురు వామికతో కలిసి విహారయాత్ర
  • అభిమానులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • వచ్చే నెలలో విరుష్కల వివాహ వార్షికోత్సవం
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ లో విహారయాత్ర చేస్తున్నారు. హిల్ స్టేషన్ లో భార్య పిల్లలతో కలిసి ఉన్న విరాట్ కోహ్లీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్‌లో అందమైన జంటల్లో ఒకటైన విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలతో ఫొటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. కుమార్తె వామికతో కలిసి విరాట్, అనుష్కలు కైంచి ధామ్ ను సందర్శించారు. 

ఇటీవలే టి20 వరల్డ్ కప్ ముగియడంతో ముంబై తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు ముందు భార్యాపిల్లలతో కలిసి హిల్ స్టేషన్ లో సేదతీరుతున్నారు. అనుష్క, విరాట్ (విరుష్క)లు 2017 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి కూతురు పుట్టగా.. వామిక అని పేరు పెట్టారు. కాగా, వచ్చే నెలలో ఈ దంపతులు ఐదవ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. 

విరాట్ తో పెళ్లయ్యాక సినిమాలు చేసే విషయంలో కాస్త నెమ్మదించిన అనుష్క శర్మ.. తాజాగా చక్ దే ఎక్స్ పరెస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మాజీ క్రికెటర్ ఝూలన్ గోస్వామీ జీవిత విశేషాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఝూలన్ గా అనుష్క శర్మ నటించనున్నారు. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాంపై విడుదల చేయనున్నట్లు సమాచారం. 
Virat Kohli
anushka
Uttarakhand
holiday
trip
vamika

More Telugu News