భారీ తగ్గింపు ధరకు 'నథింగ్' ఫోన్!
- 8జీబీ వెర్షన్ పై రూ.6,500 తగ్గింపు
- దీంతో రూ.27,500కు తగ్గిన ధర
- బ్యాంకు కార్డులపై రూ.1,500 డిస్కౌంట్
- పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.17,500 తగ్గింపు
అంతే కాదండి ఇంకా ఉంది. దీనిపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి గరిష్ఠంగా రూ.1,500 తగ్గుతుంది. అంటే అప్పుడు రూ.26 వేలకు ఈ ఫోన్ వస్తుంది. ఒకవేళ పీఎన్ బీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ రూ.1,250గా ఉంటుంది. ఇక మీ వద్ద పాత ఫోన్ ఉంటే దాన్ని ఎక్చేంజ్ చేసుకోవడం ద్వారా మరో రూ.17,500 వరకు ధర తగ్గుతుంది.
ఈ ధరలన్నీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీకి సంబంధించినవి. ఒకవేళ 12జీబీ వెర్షన్ కావాలంటే రూ.32,499 ధరకు లభిస్తోంది. దీనిపైనా బ్యాంకు కార్డుల ఆఫర్లు, ఎక్చేంజ్ ఆఫర్ అమలవుతాయి. ఫ్లిప్ కార్ట్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.