'ఇదేం కర్మ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు

19-11-2022 Sat 10:17
  • ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ
  • ఇదేం కర్మ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్న టీడీపీ శ్రేణులు
  • ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవనున్న నేతలు
Chandrababu to start Idem Karma programme
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది. 'ఇదేం కర్మ' కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈరోజు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి పోటీగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.