NEDCAP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు.. 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

  • ఓలా, ఆథర్, హీరో వంటి 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
  • ఏడాదికి లక్ష వాహనాలు అందించాలని లక్ష్యం
  • దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన నెడ్‌క్యాప్
AP Govt Employees Soon Get Electric Vehicles

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైక్‌లపై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఓలా, ఆథర్, హీరో, బిగాస్, కైనెటిక్, టీవీఎస్ వంటి 17  సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తాయి. 

ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

More Telugu News