రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ ముని మనవడు

18-11-2022 Fri 16:20
  • మహారాష్ట్రలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర
  • రాహుల్ ని కలిసిన తుషార్ గాంధీ
  • గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమన్న కాంగ్రెస్
Tushar Gandhi meets Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను ఎంతో మంది ప్రముఖులు కలుస్తున్నారు. ఈనాటి యాత్ర బుల్దానా జిల్లాలోని షెగావ్ కి చేరుకోగానే రాహుల్ ను మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిశారు. ఆయనతో కలిసి నడిచారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ... రాహుల్ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం చారిత్రాత్మకమని తెలిపింది. గాంధీ, నెహ్రూల ముని మనవళ్లు కలిసి నడవడం అద్భుతమని చెప్పింది. వీరిద్దరూ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులుగా అభివర్ణించింది.