Team India: వెల్లింగ్టన్ లో వర్షం... ఫుట్ వాలీబాల్ తో కాలక్షేపం చేసిన భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు

Team India and New Zealand cricketers plays Foot Volleyball
  • భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20
  • వర్షం కారణంగా రద్దు
  • టాస్ కు కూడా అవకాశమివ్వని వరుణుడు
  • సరదాగా గడిపిన ఇరుజట్ల ఆటగాళ్లు
  • వీడియో పంచుకున్న బీసీసీఐ
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం అయింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వెల్లింగ్టన్ లో జోరుగా వర్షం పడుతుండడంతో మ్యాచ్ నిర్వహణ వీలుకాలేదు. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఇక, మైదానంలో దిగి వార్మప్ చేసుకునేందుకు కూడా వీల్లేకపోవడంతో టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫుట్ వాలీబాల్ తో కాలక్షేపం చేశారు. కాళ్లతో ఆడే వాలీబాల్ ఆడుతూ ఇరుజట్లలోని ఆటగాళ్లు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.
Team India
New Zeland
Foot Volleyball
Wellington
1st T20

More Telugu News