D Arivind: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ఫొటోలు ఇవిగో!

TRS workers attacked BJP MP D Arvind house in Hyderabad
  • బంజారాహిల్స్ లోని అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి
  • అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం
  • దాడి సమయంలో నిజామాబాద్ లో ఉన్న అర్వింద్

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ మారబోతున్నారంటూ అర్వింద్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అర్వింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికి టీఆర్ఎస్ జెండాను కూడా కట్టారు. 100 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో జాగృతి కార్యకర్తలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో అర్వింద్ నిజామాబాద్ లో ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News