ISRO: ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయం.. నింగికెగసిన తొలి ప్రైవేట్ రాకెట్

  • శ్రీహరికోట షార్ నుంచి విక్రమ్-ఎస్ ప్రయోగం
  • లక్ష్యాన్ని చేరుకున్న రాకెట్
  • దీన్ని అభివృద్ధి చేసింది స్కైరూట్ అనే కంపెనీ
Indias first privately built rocket Vikram S launched by ISRO

భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ (విక్రమ్ సబార్బిటల్/వీకేఎస్)ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. భారత్ గర్వించతగ్గ శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరును గుర్తుకు తెచ్చేందుకు వీలుగా రాకెట్ కు విక్రమ్ అనే పేరు పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. 80 కిలోమీటర్ల లక్ష్యం కాగా, 89 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఇస్రో ప్రకటించింది. భారత అంతరిక్ష చరిత్రలో దీన్ని ఓ మైలురాయిగా, కొత్త యుగంగా ఇండియన్ స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి ఆది ఆరంభంగా చెప్పారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సైతం ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు హాజరయ్యారు.

More Telugu News