కేసినో కేసు... ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ

18-11-2022 Fri 12:09
  • చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో వ్యవహారంలో ఈడీ విచారణ
  • ఇప్పటికే తలసాని సోదరులను ప్రశ్నించిన ఈడీ
  • తాను నేపాల్ కు వెళ్లలేదని చెపుతున్న ఎల్.రమణ
TRS MLC L Ramana attends ED enquiry
కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేపాల్ లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జూన్ లో బిగ్ డాడీ పేరుతో నేపాల్ లో నిర్వహించిన ఈవెంట్ పై ప్రశ్నిస్తున్నారు. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో.... జూన్ లో గోవా, నేపాల్ లో చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరయ్యారని తెలుస్తోంది.

మరోవైపు ఈ అంశంపై ఎల్.రమణ స్పందిస్తూ... నేపాల్ కు రావాల్సిందిగా చికోటీ ప్రవీణ్ నుంచి తనకు ఆహ్వానం ఉందని... అయితే, తాను వెళ్లలేదని చెపుతున్నారు. ఇంకోవైపు ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు.