కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

17-11-2022 Thu 15:07 | National
  • డార్జిలింగ్ లో హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ
  • బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో అస్వస్థత
  • అక్కడే ప్రథమ చికిత్స అందించి సెలైన్ ఎక్కించిన వైనం
Nitin Gadkari fells ill
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్ లో నేషనల్ హైవేల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజిపై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. ఆయనను పక్కనన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. 

ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి సిలిగురి నుంచి సీనియర్ డాక్టర్ ను ఆగమేఘాలపై రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో చికిత్స కొనసాగింది. 

అనంతరం డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది. రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు.