ghee: నెయ్యి గురించి మనకు తెలియని నిజాలు..

  • నెయ్యితో బరువు తగ్గొచ్చు
  • చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది
  • తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా చూస్తుంది
  • తిన్నది మంచిగా జీర్ణం అయ్యేందుకు కూడా సాయపడుతుంది
benefits of ghee in winters and best ways to add it to your diet

నెయ్యితో శరీరంలో కొవ్వుల స్థాయి పెరిగిపోయి, మనకు హాని చేస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. నెయ్యితో బరువు పెరిగిపోతామన్న భయంతో దీన్ని దూరం పెట్టే వారు కూడా ఉన్నారు. నిజానికి నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. 


వైట్ రైస్ తినడం మంచిది కాదన్న సలహా వినే ఉంటారు. ఎందుకంటే వైట్ రైస్ లో ఉన్నదంతా కార్బోహైడ్రేట్స్. వెంటనే రక్తంలో కలసిపోయి సమస్యలకు కారణమవుతుంది. కానీ, 20 ఏళ్ల క్రితం మన పెద్దలు వైట్ రైస్ కడుపునిండా తిని ఆరోగ్యంగానే ఉన్నారు కదా. కారణం నెయ్యి. అన్నంలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ వెంటనే రక్తంలో కలవకుండా నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. దానివల్ల బ్లడ్ గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగిపోదు. నెయ్యి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చర్మం ఆరోగ్యానికి, శారీరక, మానసిక బలానికి (జ్ఞాపకశక్తి) నెయ్యి మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఈ కాలంలో అదనపు ప్రయోజనాలున్నాయి.

వింటర్ లో మంచిది
  • శీతాకాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి వేడినిస్తుంది. అధిక వేడిని (400 డిగ్రీల ఫారిన్ హీట్ వరకు) తట్టుకునే శక్తి నెయ్యికి ఉంది. కనుక వంటల్లో వాడుకోవచ్చు. 
  • జీర్ణరసాల ప్రేరణకు నెయ్యి తోడ్పడుతుంది. అందుకే ఆహారంతో పాటు నెయ్యిని తీసుకోవడం వల్ల తిన్నది మంచిగా జీర్ణమవుతుంది. 
  • నెయ్యికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. కనుక దగ్గు, జలుబు తగ్గేందుకు సాయపడుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెండు చుక్కల చొప్పున రెండు నాసికా రంధ్రాల్లో వేసుకుంటే తక్షణ ఉపశమనం దక్కుతుంది.
  • ఇక ఈ కాలంలో చర్మం పొడిబారి, చర్మ సమస్యలు కనిపిస్తుంటాయి. వీటికి నెయ్యి చక్కని పరిష్కారం. నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది. 

చపాతీకి నెయ్యి జోడించండి..
ఇక చపాతీ తినే వారు దానికి నూనెకు బదులు నెయ్యి జోడించుకోవడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ గా మారిపోతుంది. దీనివల్ల మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉత్తరాదిలో చపాతీలను నెయ్యితో చేసుకుని తింటుంటారు. దీనివల్ల చపాతీల గ్లైసిమిక్ ఇండెక్స్ వ్యాల్యూ తగ్గుతుంది. అంటే బ్లడ్ గ్లూకోజ్ వెంటనే పెరగదు. హార్మోన్ల సమతుల్యతకు, బరువుతగ్గడానికి కూడా నెయ్యి సాయపడుతుంది.

More Telugu News