యాపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 13, 14పై తగ్గింపు ఆఫర్లు

  • ఈ నెల 20 వరకు ఫ్లిప్ కార్ట్ యాపిల్ డేస్ సేల్
  • యాపిల్ ఫోన్ల ధర రూ.5,000-9,000 తగ్గింపు
  • ఫెడరల్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్
Flipkarts Apple Days Sale live in India Offers on iPhone 14 13 and more

యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వారికి ముఖ్య గమనిక. ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా యాపిల్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఐఫోన్ 12, 13, 14 ఫోన్లను తగ్గింపు ధరలపై కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ వరకు యాపిల్ డేస్ సేల్ విక్రయాల కార్యక్రమం కొనసాగుతుంది.


ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.79,900 కాగా, తగ్గింపై రూ.74,900కే లభిస్తోంది. ఇదే ధరకు యాపిల్ ఈ-స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ 13 128జీబీ స్టోరేజీ ధర రూ.69,900 కాగా, రూ.64,999కే లభిస్తోంది. ఐఫోన్ 13 256 జీబీ వేరియంట్ సైతం రూ.5వేలు తక్కువగా రూ.74,999కే లభిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డుపై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. 

ఫెడరల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి 10 శాతం (గరిష్టంగా రూ.1,500) తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్సేంజ్ పై మరో రూ.17,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఐఫోన్ 12 128జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, కేవలం రూ.55,999కు సొంతం చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. 

ఐఫోన్ 13, 14లో ఏది తీసుకోవాలన్న సందేహంతో ఉన్నారా..? బ్యాటరీ, కెమెరా పరంగా ఐఫోన్ 14లో కొంచెం మెరుగైన పనితీరు ఉంటుంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్.

More Telugu News