Telangana: ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్ నే చేర్చుకోలేదు... కవితను ఎలా చేర్చుకుంటాం?: బీజేపీ నేత బండి సంజయ్

bjp telangana chief bandi sanjay reacts on cm kcr comments
  • హైదరాబాద్ లో మీడియాతో బండి సంజయ్ ఇష్టాగోష్టి
  • కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధమేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి
తన కుమార్తెను కూడా పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారని టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ నేడు హైదరాబాద్ లో పలు మీడియా సంస్థలతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. అదే పనిగా ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్ నే తాము చేర్చుకోలేదని... కవితను ఎలా చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించారు. 

కేసీఆర్ ఎలాంటి యుద్ధం చేసినా తాము సిద్ధంగానే ఉన్నామన్న సంజయ్... టీఆర్ఎస్ కంటే ముందు యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 

కేసీఆర్ లో భయం మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే గుర్తించారని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్ చెబుతున్నారని ఆయన అన్నారు.
Telangana
BJP
TRS
Bandi Sanjay
KCR
K Kavitha

More Telugu News