Krishna: సీనియర్ హీరో హరనాథ్ ను ఆదుకున్న కృష్ణ!

krishna Special
  • టాలీవుడ్ లో సాహసాలు చేసే హీరోగా కృష్ణకి పేరు
  • సహాయాలు చేయడంలోను ముందంజ
  • హరనాథ్ ను గౌరవించిన కృష్ణ 
  • ఆత్మీయంగా ఆదరించిన తీరు  
టాలీవుడ్ హీరోల్లో అత్యంత ఫాస్టుగా సినిమాలు చేసే హీరోగా .. ఫాస్టుగా డబ్బింగ్ చెప్పే హీరోగా .. ఎంత పెద్ద డైలాగ్ అయినా ను సింగిల్ టేక్ లో చెప్పే హీరోగా కృష్ణకి పేరుంది. ఇక తనకంటే ముందున్న హీరోలతోను .. తనతోటి హీరోలతోను మల్టీ స్టారర్ లు చేసిన హీరోగా ఒక ప్రత్యేకత ఉంది. ఇక కథాకథనాలకే కాదు .. పాటల విషయంలోను ప్రత్యేకమైన దృష్టి పెట్టే హీరోగాను ఆయన గురించి చెప్పుకుంటారు. అందువల్లనే ఆయన సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ సాంగ్స్ జాబితాలో కనిపిస్తూ ఉంటాయి. 

ఇక కృష్ణ సాహసాలు చేయడంలోనే కాదు .. సహాయాలు చేయడంలోను ముందే ఉంటారనడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆయన నుంచి సహాయాన్ని పొందినవారిలో సీనియర్ హీరో హరనాథ్ కూడా కనిపిస్తారు. 

కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి వచ్చారు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి హరనాథ్ మద్యానికి బానిస కావడంతో ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఒకానొక దశలో వేషాలు లేని పరిస్థితి వచ్చేసింది. 

అలాంటి పరిస్థితుల్లో ఆయన కృష్ణను కలుసుకోవడానికి 'పద్మాలయ స్టుడియో'కి వెళ్లారట. ఈ విషయం కృష్ణకి తెలిసి ఆయన స్వయంగా వచ్చి లోపలికి తీసుకుని వెళ్లారు. అంతే కాకుండా ఆయన్ను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేయడమే కాకుండా, కొన్ని రోజుల పాటు అక్కడే ఉండేలా బస ఏర్పాటు చేశారు. 

ఆ తరువాత హరనాథ్ కి కొత్త బట్టలు పెట్టి... ఆయన అవసరాలను గ్రహించి పెద్ద మొత్తంలోనే చేతిలో పెట్టి ఆత్మీయంగా చెన్నైకి సాగనంపారు. అయితే ఈ విషయాన్ని తానుగా కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.
Krishna
Haranath
Tollywood

More Telugu News