Krishna: ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

Krishna funerals completed
  • మహాప్రస్థానంలో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
  • కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులకు మాత్రమే అనుమతి
  • నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. దారికి ఇరువైపులా నిలబడిన అభిమానులు తమ అభిమాన నటుడికి కన్నీటితో వీడ్కోలు పలికారు. 

మరోవైపు మహాప్రస్థానంలోకి కృష్ణ కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులను మాత్రమే అనుమతించారు. అంత్యక్రియలను కూడా పోలీసుల గౌరవ వందనం వరకు మాత్రమే లైవ్ లో చూపించారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ ను ఆపేశారు. 

హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Krishna
Funerals
Tollywood

More Telugu News