TDP: కర్నూలు జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు... మాజీ సీఎం కోట్లకు నివాళి అర్పించిన టీడీపీ అధినేత

chandrababu paid tributes to ex cm kotla vijaya bhaskar reddy and starts his kurnool tour
  • హైదరాబాద్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరిన చంద్రబాబు
  • ఘన స్వాగతం పలికిన జిల్లా పార్టీ శ్రేణులు
  • బాబు వస్తేనే జాబు వస్తుందని తెలుగు యువత నినాదాలు
  • నేటి రాత్రి ఆదోనిలో బస చేయనున్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లాలో అడుగు పెట్టారు. హైదరాబాద్ నుంచి విమానంలో కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు విమానాశ్రయం చేరిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిల సమక్షంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా బాబు వస్తేనే జాబు వస్తుంది అంటూ జిల్లాకు చెందిన తెలుగు యువత నేతలు నినాదాలు చేశారు.

ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా జిల్లా పరిధిలోని కోడుమూరుకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత, మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం ఆయన అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి రాత్రి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు... రేపు, ఎల్లుండి కూడా జిల్లాలోనే పర్యటించనున్నారు.
TDP
Chandrababu
Kurnool District
Kotla Vijaya Bhaskar Reddy
Kodumur

More Telugu News